మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 23:30:03

దర్శకురాలిగా అరంగేట్రం

దర్శకురాలిగా అరంగేట్రం

తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగానే కాకుండా ప్రతినాయిక పాత్రల్లో విలక్షణ అభినయాన్ని ప్రదర్శిస్తూ మెప్పిస్తోంది వరలక్ష్మిశరత్‌కుమార్‌. తాజాగా ఆమె మెగాఫోన్‌ పట్టబోతుంది. ‘కన్నమూచి’పేరుతో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఆదివారం వరలక్ష్మిశరత్‌కుమార్‌ ప్రకటించింది. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ‘దర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తబోతున్నా.  మంచి సినిమా చేసేందుకు  శాయశక్తులా కృషిచేస్తాను’ అంటూ వరలక్ష్మిశరత్‌కుమార్‌ పేర్కొన్నది. రక్తం మరకలతో ఉన్న చేతులు ఓ యువతి  కళ్లను మూసినట్లుగా ఉన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆసక్తిని పంచుతోంది.  సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనల్ని వ్యతిరేకిస్తూ సందేశాత్మక కథాంశంతో వరలక్ష్మిశరత్‌కుమార్‌ ఈ సినిమాను రూపొందించనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రంలో  వరలక్ష్మి కథానాయికగా నటించనుందని వార్తలొస్తున్నాయి.


logo