మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 16:23:48

40 ప్ల‌స్ లో స్టార్ హీరో స్టంట్స్ చూశారా..?

40 ప్ల‌స్ లో స్టార్ హీరో స్టంట్స్ చూశారా..?

గ‌తంలో పెద్ద పెద్ద హీరోలు తమ బాడీ లాంగ్వేజ్ పై కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు కాలంతోపాటు ట్రెండ్ మారింది. సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది సెల‌బ్రిటీలు ఫిట్ నెస్ పై ఎక్కువ‌గా శ్ర‌ద్ద పెడుతున్నారు. యువ న‌టీన‌టుల‌కు మేమేమీ త‌క్కువ కాదంటూ సీనియ‌ర్ స్టార్లు వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియోల‌ను షేర్ చేస్తూ..ఫిట్ నెస్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ క్రేజీ ఫిట్ నెస్ స్టంట్స్ వేస్తున్నాడు.

40 ప్ల‌స్ లో  కూడా చాలా ఎన‌ర్జిటిక్‌గా త‌ల‌కిందులుగా ప‌ల్టీలు వేస్తూన్న పునీత్ రాజ్‌కుమార్ వ‌ర్క‌వుట్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ చ‌క్క‌ర్లు కొడుతోంది. వ‌ర్క‌వుట్స్ లేని రోజు వృధాగా గ‌డిచిపోయిన‌ట్టే అని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు పునీత్ రాజ్‌కుమార్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo