మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 18:02:40

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసిన క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసిన క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్

ప్ర‌ముఖ సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ క‌లిశారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన సుదీప్..ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మొక్క‌ను అంద‌జేశారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో  సుమారు గంట‌పాటు స‌మావేశమ‌య్యారు. సినిమాల‌కు సంబంధించిన అంశంతోపాటు ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్తితులు, వివిధ అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఈ స‌మావేశానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

గతేడాది స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ద‌బాంగ్ 3 చిత్రంలో సుదీప్ విల‌న్ గా క‌నిపించి అల‌రించారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ డైరెక్ష‌న్ లో పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో సినిమాతోపాటు మ‌రో సినిమాకు కూడా గ్నీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo