టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తోన్న చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని టాక్. కోవిడ్ పరిస్థితులు తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు సురేందర్ రెడ్డి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం తీసుకోవాలని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. పవర్ ఫుల్ రోల్‌ను డిజైన్ చేసిన డైరెక్టర్ ఉపేంద్ర అయితే బాగుంటుందని భావిస్తున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఉపేంద్ర తెలుగులో చివరిసారిగా అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తిలో నటించాడు.
అంతా అనుకున్నట్టుగా జరిగితే ఏజెంట్ సినిమాలో యాక్షన్ రోల్లో కనిపించనున్నాడని టాక్. ఉపేంద్ర ఈ ఆఫర్ పై ఇప్పటివరకు మేకర్స్ కు ఎలాంటి హామీనివ్వనట్టు తెలుస్తోంది. మరి ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్