బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 13:31:37

హీరోయిన్, ఆమె ఫ్యామిలీకు క‌రోనా పాజిటివ్

హీరోయిన్, ఆమె ఫ్యామిలీకు క‌రోనా పాజిటివ్

క‌న్న‌డ హీరోయిన్  శర్మిలామండ్రే క‌రోనా బారిన ప‌డ్డారు. త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని క‌న్‌ఫాం చేసిన శ‌ర్మిలా.. త‌న‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌లో కొంద‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ వైద్యుల స‌ల‌హాల‌తో చికిత్స పొందుతున్నాము అని పేర్కొంది. శ‌ర్మిలా తెలుగులో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా ‘కెవ్వుకేక’ చిత్రంలో న‌టించింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి  స్నేహితుల‌తో బ‌య‌ట తిరుగుతూ నానా ర‌చ్చ చేసిన శ‌ర్మిలా మండ్రే కొద్ది రోజుల పాటు వార్త‌ల‌లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలోను ఈ అమ్మ‌డు పేరు వినిపిస్తుంది. అయితే దీనిపై స్పందించిన శ‌ర్మిలా కొన్ని న్యూస్ ఛానెల్స్ టీఆర్పీల కోసం త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తుంద‌ని పేర్కొంది.  నేను చాలా సంవత్సరాల కృషితో ఈ స్థాయికి వ‌చ్చాను. ద‌యచేసి అర్ధం చేసుకోండ‌ని ట్వీట్‌లో తెలిపింది. 


logo