శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 18:29:05

"ఇస్లాం" లోకి సంజ‌నా..నిశ్చితార్థం కూడా పూర్తి..!

డ్రగ్స్ స్కాండ‌ల్ కేసులో న‌‌టి సంజ‌నా గ‌ర్లానీని క‌ర్ణాట‌క పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ లో అంత‌గా స‌క్సెస్ లేని సంజ‌నా పేరు మీద భారీ మొత్తంలోనే ఆస్తులున్న‌ట్టు బెంగ‌ళూరు పోలీసులు గుర్తించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా సంజ‌నాకు సంబంధించిన మ‌రో వార్త కూడా ఇపుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. సంజ‌నా రెండేళ్ల క్రితం ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించింది. ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌దానికి సంబంధించిన స‌ర్టిఫికెట్ ఇపుడు సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతోంది.

అంతేకాదు దారుల్ ఉలూమ్ షా వ‌లీయుల్లా స‌ర్టిఫికెట్ లో సంజ‌నా పేరు మ‌హీరాగా మార్చుకున్న‌ట్టు ఉంద‌ట. అయితే సంజ‌నా ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన విష‌యంపై పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. తాను సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాన‌ని పోలీసుల విచార‌ణ‌లో తెలిపిన సంజ‌న‌..పోలీసులు డాక్ట‌ర్ అజీజ్ పాషాతో జ‌రిగిన నిశ్చితార్థం ఫొటోను చూపించే స‌రికి ఏం చెప్పకుండా ఉండిపోయింద‌ని స‌మాచారం. ఇదంతా గ‌మ‌నిస్తే ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి రాబోయే కాలంలో సంజ‌నా పోలీసుల విచార‌ణ‌లో ఇంకెన్ని విష‌యాలు బ‌య‌ట‌కువ‌స్తాయో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.