శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 11:25:35

డ్రగ్స్‌ వ్యవహారం: న‌టి అరెస్ట్‌

డ్రగ్స్‌ వ్యవహారం: న‌టి అరెస్ట్‌

సినిమా ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతుంది. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ విష‌యంపై కంగ‌నా ర‌నౌత్ ఇప్ప‌టికే  సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌గా, క‌న్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకంపై సినీ నిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ కొంత స‌మాచారాన్ని సేక‌రించి  సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నటి రాగిణిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

అయితే ఈ రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌కే రాగిణీ నివాసానికి చేరుకున్న సీసీబీ..  బెంగ‌ళూరులోని రాగిణి ద్వివేది నివాసంలో శోధ‌న‌లు నిర్వ‌హించారు. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన పోలీసులు న‌టి ఇంటిని క్షుణ్ణంగా త‌నిఖీ చేసారు.  అక్క‌డ కొంత స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్టు తెలుస్తుంది. కాగా, రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.  


logo