మంగళవారం 02 జూన్ 2020
Cinema - Feb 19, 2020 , 11:15:14

అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టి మృతి

అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టి మృతి

బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలో కావేరీ అమ్మగా  న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న క‌న్న‌డ న‌టి కిషోరి బల్లాళ్‌ (82 ) . మంగళవారం ఆమె అనారోగ్యంతో మృతి చెందడం శాండల్‌వుడ్‌లో విషాదం నింపింది. సుమారు 75 సినిమాల‌లో న‌టించిన కిషోరి  1960లో ‘ఇవలెంత హెందాతీ’ చిత్రంతో వెండతెరపై తెరంగ్రేటం చేశారు. అయ్య’, ‘కెంపేగౌడ’, ‘నమ్మణ్ణ’, ‘గేర్‌ కానూని’ వంటి పలు కన్నడ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో వెంకటేష్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంలోనూ నటించారు. కన్నడ మెగా సీరియల్‌ ‘వర్షిణి’లోను బ‌ల్లాళ్‌ నటించారు. విష్ణువర్ధన్‌, అంబరీష్‌, ప్రభాకర్‌, దర్శన్‌, సుదీప్ వంటి స్టార్స్ సినిమాల‌లో న‌టించి క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యారు.  కెంపేగౌడ ప్రశస్తి, కన్నడ అకాడమీ ప్రశస్తి, ఐఫా ప్రశస్తి వంటి అవార్డులు ఆమె దక్కించుకున్నారు.  కిశోరి బల్లాళ్‌ మృతికి కర్ణాటక చలనచిత్ర మండలి అధ్యక్షుడు జయరాజ్‌తో పాటు ప‌లువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  


logo