బెంగళూరు : తమ ప్రేమకు అడ్డు పడుతున్న తమ్ముడిని ఓ కన్నడ నటి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కన్నడ నటి శనయ కాత్వే.. రియల్టర్ నియాజ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ గత కొంతకాలం నుంచి కలిసే ఉంటున్నారు. అయితే వీరి ప్రేమకు శనయ తమ్ముడు రాకేశ్ కాత్వే అడ్డుపడుతున్నాడు. దీంతో ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఏప్రిల్ రెండో వారంలో రాకేశ్‌ను హత్య చేసి హుబ్లీకి సమీపంలోని అడవుల్లో పడేసి నిప్పు పెట్టారు. అయితే ఏప్రిల్ 12న ఆ అడవుల్లో రాకేశ్ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేశ్‌ను హత్య చేసింది శనయ, ఆమె బాయ్ ఫ్రెండ్ నియాజ్‌తో పాటు మరో ముగ్గురని తేలింది. దీంతో శనయ, నియాజ్‌తో పాటు ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసులో నియాజ్ కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని విచారణలో తేలింది. రాకేశ్ కాత్వే ఓ బార్లో హౌస్ కీపర్‌గా పని చేస్తున్నాడు.