బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 06, 2020 , 10:41:24

ఆరో టెస్ట్‌లో నెగెటివ్‌.. డిశ్చార్జ్ అయిన క‌నికా క‌పూర్

ఆరో టెస్ట్‌లో నెగెటివ్‌.. డిశ్చార్జ్ అయిన క‌నికా క‌పూర్

కొద్ది రోజులుగా క‌రోనాతో బాధ‌ప‌డుతున్న బాలీవుడ్ సింగ‌ర్ క‌నికా క‌పూర్ ఎట్ట‌కేల‌కి ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయింది.  మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చి అక్కడి నుంచి కాన్పూర్, లక్నో వెళ్లారు. అక్కడ ఓ విందులో ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు కనికాను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో ఆమెకి పాజిటివ్‌గా తేల‌డంతో గ‌త 15 రోజులుగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నరు.  నాలుగు సార్లు టెస్ట్స్ నిర్వహించినా పాజిటివ్ రావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందారు.

ఇటీవ‌ల క‌నికాకు  ఐదోసారి  నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షలో నెగెటివ్‌గా తేలింది. అయిన‌ప్ప‌టికీ కొన్నిరోజులు ఆసుప‌త్రిలో ఉంచి సోమవారం 6వ టెస్ట్ నిర్వ‌హించారు. నెగెటివ్ రావ‌డంతో నేడు హాస్పిటల్ నుండి ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆమె కొన్నిరోజులు ఇంటి సభ్యులకు దూరంగా ఉండడంతో పాటు, తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా డాక్టర్స్ సూచించినట్లు స‌మాచారం. రెండు వారాలుగా పిల్ల‌ల‌ని, కుటుంబాన్ని మిస్ అవుతూ వ‌చ్చిన క‌నికా అత్యంత మ‌నోవేద‌న చెందిన సంగ‌తి తెలిసిందే.


logo