సోమవారం 25 మే 2020
Cinema - Mar 30, 2020 , 11:44:41

ఐసీయూలో లేను.. పిల్ల‌ల‌ని మిస్ అవుతున్నా: క‌నికా

ఐసీయూలో లేను.. పిల్ల‌ల‌ని మిస్ అవుతున్నా: క‌నికా

మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చిన కనికా కపూర్ అక్కడి నుంచి కాన్పూర్, లక్నో వెళ్లారు. అక్కడ ఓ విందులో ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు కనికాను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో ఆమెకి పాజిటివ్‌గా తేల‌డంతో గ‌త 10 రోజులుగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు.

గ‌త మూడు సార్లు జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో క‌నికాకి పాజిటివ్ రాగా, నాలుగోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. దీనిని బ్టటి కనిక శరీరం చికిత్సకు ప్రతిస్పందించడం లేదని అనిపిస్తున్నదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఐసీయూలో చికిత్స పొందుతున్న‌ట్టు ప్ర‌చారం చేశారు. అయితే క‌నికా త‌న ఇన్‌స్టాగ్రాం ద్వారా గ‌త రాత్రి స్పందించింది.

నేను ఐసీయూలో లేను. నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. జీవితం సమయాన్ని ఎలా తెలివిగా వాడుకోవాలో నేర్పిస్తే... మనకు సమయం జీవితం విలువని నేర్పిస్తుంది అనే ఇమేజ్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. త‌న కుటుంబ స‌భ్యుల‌ని , పిల్ల‌ల‌ని చాలా మిస్ అవుతున్నానంటూ పేర్కొంది.త‌దుప‌రి ప‌రీక్ష‌లో నెగెటివ్ రిపోర్ట్ రావాల‌ని దేవుడిని కోరుకుంటున్న‌ట్టు క‌నికా పేర్కొంది.logo