బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 13:58:20

ఫ్యామిలీతో కంగనా పిక్నిక్..వీడియో వైరల్

ఫ్యామిలీతో కంగనా పిక్నిక్..వీడియో వైరల్

హిమాచల్ ప్రదేశ్: తన నటనతో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది అందాల తార కంగనారనౌత్. సినిమా సినిమాకు వైవిధ్య కథాంశాలను ఎంచుకునే ఈ బ్యూటీ ప్రస్తుతం సరదా సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. స్వస్థలం మనాలీలోని అందమైన నివాసంలో కుటుంబంతో కాలక్షేపం చేస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలు కావడం, ఆ తర్వాత మనాలీతోపాటు పలు ప్రాంతాలు గ్రీన్ జోన్లు గా మారడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది.

కంగనా సోదరి రంగేలి, బంధువు పృథ్వి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పిక్నిక్ కు వెళ్లింది. మనాలీలోని అందమైన కొండ, లోయ ప్రాంతాల్లో  తమకిష్టమైన వంటకాలు ఆరగిస్తూ..ఫ్యామిలీతో సరదాగా ఆటలు ఆడుతూ, ముచ్చటిస్తూ ఎంజాయ్ చేసింది. అందమైన లోయల్లో స్వేచ్చతో కూడిన సంతోషకరమైన క్షణాలు..ఎన్నో రకాల సమస్యలకు వైద్యం లాంటిది ప్రకృతి అంటూ ట్రిప్ ఫొటోలను కంగనా షేర్ చేసింది. logo