కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన కంగనా రనౌత్ ఇటీవల జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కిన తలైవీ చిత్రంలో నటించింది. ఇందులో జయలలిత పాత్రను పోషించింది ఈ ముద్దుగుమ్మ. కరోనా వలన సినిమా రిలీజ్ ఆగిపోగా, వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు థాకడ్ అనే సినినిమతో పాటు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తుంది కంగనా.
ఇన్నాళ్లు సినిమాలతో సందడి చేసిన కంగనా ఇప్పుడు ఓటీటీలోకి అడగుపెడుతున్నట్టు తెలుస్తుంది. ఇంగ్లీష్ షో టెంప్టేషన్ ఐ లాండ్ కి ఇండియన్ వర్షన్‌గా కంగనా రియాలిటీ షో చేయనుంది. ఈ రియాలిటీ షో డేటింగ్ కి సంబంధించినట్లు తెలుస్తోంది. ఇది ఒక డేటింగ్ షో అని దీన్ని ఇండియా లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక దిగ్గజం ఓటిటి నిర్మించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా, దీని కోసం భారీ మొత్తం చెల్లించనున్నారని సమాచారం.