మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 16:12:17

ముంబైలో పవర్‌ కట్‌.. సంజయ్‌ రౌత్‌పై కంగనా ఎటాక్‌

ముంబైలో పవర్‌ కట్‌.. సంజయ్‌ రౌత్‌పై కంగనా ఎటాక్‌

ముంబై: పవర్‌ కట్‌తో దేశ వాణిజ్య రాజధాని ముంబై సోమవారం కొన్ని గంటలపాటు స్తంభించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మహారాష్ట్రలోని అధికార శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. కమేడియన్‌ కునాల్ కమ్రాతో కలిసి సంజయ్‌ రౌత్‌ బుల్డోజర్‌ బొమ్మ పట్టుకున్నఫొటోను అందులో ఫేర్‌ చేశారు. ముంబైలో పవర్‌ కట్‌.. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం.. ’ (ఇలా ఆడుకుంటోంది) అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ తీరుకు ఇది నిదర్శనమని, ప్రభుత్వం కూడా పవర్‌ (అధికారం) కష్టాలను ఎదుర్కోంటోందని కంగనా రనౌత్‌ పరోక్షంగా మండిపడ్డారు. 


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మరణం కేసు నేపథ్యంలో కంగనా రనౌత్‌, సంజయ్‌ రౌత్‌ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ముంబైను ఆమెను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడంపై సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలోని కంగనా కార్యాలయాన్ని బీఎంసీ పాక్షికంగా కూల్చివేయడం తనపై కక్షతోనే జరిగిందని ఆమె ధ్వజమెత్తారు. కూల్చివేతపై నష్ట పరిహారం కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగనా చివరకు సంజయ్‌ను కూడా ప్రతివాదిగా చేర్చిన సంగతి తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo