సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 11:56:14

మ‌హారాష్ట్రకి కంగనా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే: స‌ంజ‌య్

మ‌హారాష్ట్రకి కంగనా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే: స‌ంజ‌య్

గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌.. శివ‌సేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్‌రౌత్‌ల మ‌ధ్య బిగ్ వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. కంగ‌నా ముంబై మ‌హానగరాన్ని పీవోకేతో పోల్చుతూ కామెంట్స్ చేసే స‌రికి ఆయ‌న తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కంగ‌నాని పీవోకేకే పంపండి ముంబైకి రానివ్వ‌కండి అని చెప్పారు. దీనిపై స్పందించిన కంగ‌నా సెప్టెంబ‌ర్ 9న తాను ముంబైకి వ‌స్తున్న‌ట్టు చెబుతూ, ఎవ‌రు ఆపుతారో ఆపండి చూస్తా అంటూ స‌వాల్ విసిరింది.

తాజాగా కంగ‌నాకు క్ష‌మాప‌ణ‌లు చెబుతారా అని సంజయ్ రౌత్‌ను ప్ర‌శ్నించిన‌ప్పుడు కంగనా ముందుగా మ‌హారాష్ట్ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అన్నారు. ఆమె చెప్పాక నేను కంగ‌నాకు క్ష‌మాప‌ణ చెప్ప‌డం గురించి ఆలోచిస్తాను అని పేర్కొన్నారు. ముంబైని మినీ పాకిస్తాన్ గా పిలిచిన ఆమె అహ్మ‌దాబాద్ గురించి అలానే మాట్లాడే ధైర్యం ఉందా అంటూ ప్ర‌శ్నించారు. కాగా, సుశాంత్ మరణం విషయంలో ముంబై పోలీసుల తీరును విమ‌ర్శిస్తూ కంగనా ముంబైని పీవోకేతో పోల్చిన సంగ‌తి తెలిసిందే.


logo