శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 23:35:20

అసెంబ్లీలో తలైవిపై దాడి

అసెంబ్లీలో తలైవిపై దాడి

దాదాపు ఆరు నెలల విరా మం తర్వాత కెమెరా ముందుకొచ్చింది కంగనా రనౌత్‌. బహుభాషా చిత్రం ‘తలైవి’ చిత్రీకరణలో పాల్గొంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది. సెట్స్‌లో దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ తనకు సీన్‌ను వివరిస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది కంగనా రనౌత్‌. ‘ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. నేను ఎక్కువగా ఇష్టపడేది,  సౌకర్యవంతంగా భావించేది మాత్రం సినిమా సెట్స్‌నే ’ అంటూ కంగనా  ఈ ఫొటోను ఉద్ధేశించి వ్యాఖ్యానించింది. తాజా షూటింగ్‌లో జయలలితపై తమిళనాడు అసెంబ్లీలో జరిగిన దాడి సన్నివేశాల్ని తెరకెక్కి స్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ నిర్మిస్తున్నారు. అరవిందస్వామి, ప్రకాష్‌రాజ్‌, భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. logo