మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 17:30:21

చైనా యాప్‌ల నిషేధంపై కంగనా రియాక్షన్‌

చైనా యాప్‌ల నిషేధంపై కంగనా రియాక్షన్‌

భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తోపాటు 59 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా బలమైన సందేశాన్నిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ స్వాగతించింది.

‘ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. చాలా మంది ప్రజలు వేడుకలు జరుపుకుంటారనుకుంటున్నా. చైనా కమ్యూనిస్ట్‌ దేశమనే విషయం తెలిసిందే. చైనా మన ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో ఎలా చొరబడిందో అందరికీ తెలుసు. కరోనాకు ఆజ్యం పోసిన చైనాపై మన వ్యాపారం ఎంతవరకు ఆధారపడి ఉంది. డాటా విషయంలో ఆందోళన ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వారు (చైనీయులు) లఢఖ్‌లో సమస్యను సృష్టిస్తున్నారు. వారికి కేవలం లఢఖ్‌ మాత్రమే కాదు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింతోపాటు అసోం కూడా కావాలి. ఇది ఇంతటితో ఆగేది కాదని’ చెప్పుకొచ్చింది కంగనా. 


logo