బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సినీ, రాజకీయ ప్రముఖులని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నాగచైతన్య విడాకులకి పరోక్షంగా ఆమీర్ ఖాన్ కారణం అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అనంతరం షారూఖ్ ఖాన్ తనయుడిని సపోర్ట్ చేసిన హృతిక్ రోషన్‌పై విరుచుకు పడింది. ఇక ఇప్పుడు ఏకంగా షారూఖ్ ఖాన్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కొందరు ఆయనకు మద్దతు ప్రకటిస్తుండగా, మరి కొందరు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కంగనా రనౌత్.. జాకీచాన్ ప్రస్తావన తెస్తూ ఇన్‌డైరెక్ట్‌గా షారూఖ్‌పై విమర్శలు చేసింది.
హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీ చాన్ కుమారుడు జైసీ చాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన జాకీ ఇది తన పెంపకంలో లోపం వలనే జరిగిందని క్షమాపణలు తెలిపాడు. కొడుకును కాపాడే ప్రయత్నం చేయనని అన్నాడు. జైసీ ఆరునెలల శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మరోసారి అందరి సారీ చెప్పాడు ఈ యాక్షన్ హీరో. ఇప్పుడు షారూఖ్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలని కంగనా చూస్తుందా అని అంతా ముచ్చటించుకుంటున్నారు.