ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 22:26:29

కంగ‌న‌ సంచ‌ల‌నం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట‌!

కంగ‌న‌ సంచ‌ల‌నం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట‌!

న్యూఢిల్లీ: బాలీవుడ్ క‌థా నాయిక కంగ‌నా ర‌నౌత్ అనుస‌రించే స్ట‌యిల్ ఆఫ్ సెన్స్‌ను అంతా అభినందిస్తారు. ఖ‌ర్చుతో కూడిన బ్యాగ్‌లు మొద‌లు డిజైన‌ర్ డ్ర‌స్‌ల కొనుగోళ్ల వ‌ర‌కు ఆమె ముందు వ‌రుస‌లోనే ఉంటూ వ‌చ్చారు. అయితే ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో సినీ రంగంలోకి వ‌చ్చిన పాత రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. సొంతంగా రూపొందించుకున్న డిజైన్ డ్ర‌స్ కొనుగోలు చేయ‌డానికి స‌రిప‌డా డ‌బ్బుల్లేవ‌ని పేర్కొన్నారు. 

మ‌హిళ‌లే ప్రాధాన్యంగా ప్రియాంక చోప్రా, ముగ్ద గాడ్సే ఇత‌ర క‌థా నాయిక‌లు న‌టించిన సినిమాలో త‌న పాత్ర‌కు కంగ‌నా ర‌నౌత్‌కు ఉత్త‌మ స‌హాయ క‌థా నాయిక అవార్డు ల‌భించింది. కొద్దిసేపే ఈ సినిమాలో న‌టించినా కంగ‌న ర‌నౌత్ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారు. ఈ అవార్డును నాటి రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిభాపాటిల్ చేతుల మీదుగా కంగ‌నా ర‌నౌత్ అందుకున్నారు. రెడ్‌, గోల్డెన్‌, గ్రీన్ బార్డ‌ర్‌తో డిజైన్ చేసిన అనార్క‌లీ సూట్‌తో ఈ కార్య‌క్ర‌మానికి కంగ‌న హాజ‌ర‌య్యారు. 

యువ న‌టిగా త‌న‌కు ఆ అవార్డు రావ‌డం గొప్ప గౌర‌వం అని.. అందునా మ‌హిళ‌లే ప్రాధాన్యంగా వ‌చ్చిన సినిమాలో పాత్ర‌కు వ‌చ్చిన అవార్డును మ‌హిళా రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అందుకున్నాన‌ని గుర్తు చేసుకున్నారు కంగ‌నా ర‌నౌత్‌. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యేందుకు డిజైన్ చేసుకున్న డ్ర‌స్ కొనుగోలు చేయ‌డానికి స‌రిప‌డా డ‌బ్బు లేద‌ని పేర్కొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo