బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 23:21:48

కంగనా వితరణ 25లక్షలు

కంగనా వితరణ 25లక్షలు

కరోనా బాధితుల సహాయార్థం తారల నుంచి ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌ అగ్ర నాయిక కంగనారనౌత్‌  పీఏం కేర్స్‌కు ఇరవై ఐదు లక్షల విరాళాన్ని అందజేసింది.  దినసరి వేతన కార్మికులకు నిత్యవసరాల్ని అందజేసినట్లు ఆమె సోదరి రంగోళి తెలిపింది. కంగనా రనౌత్‌ తల్లి ఆశ రనౌత్‌ నెల పెన్షన్‌ను ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ సినీ కార్మికులకు బాసటగా నిలిచారు. వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌కు 51 లక్షల వితరణను ఇచ్చారు.   పదిహేను వేల మంది సినీ వర్కర్స్‌కు యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ముందుకొచ్చింది. అలాగే సైఫ్‌ అలీఖాన్‌, కరీనాకపూర్‌ దంపతులు పీఏం కేర్స్‌తో పాటు మహారాష్ట్ర రిలీఫ్‌ఫండ్‌కు విరాళాన్ని అందజేశారు. ఈ కఠిన సమయంలో సాయపడే చేతులతో పాటు ప్రతి రూపాయి విలువైనవేనని  వారు పేర్కొన్నారు. ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది మాత్రం వెల్లడించలేదు. అలాగే కరీనా కపూర్‌ సోదరి కరిష్మాకపూర్‌ సైతం పీఏం కేర్స్‌కు తన పిల్లలతో కలిసి విరాళాన్ని అందజేసింది. మానవత్వంతో దేశం కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. మరికొందరు తారలు తమకు తోచిన రూపాల్లో సహాయపడబోతున్నామని సోషల్‌మీడియాలో పేర్కొంటున్నారు. logo