సోమవారం 08 మార్చి 2021
Cinema - Dec 17, 2020 , 15:05:16

జాన‌ప‌ద డ్యాన్స‌ర్ల‌తో స్టెప్పులేసిన కంగ‌నా

జాన‌ప‌ద డ్యాన్స‌ర్ల‌తో స్టెప్పులేసిన కంగ‌నా

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ న‌వంబ‌ర్ లో త‌న సోద‌రుడి వివాహ వేడుక‌లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. బ్ర‌ద‌ర్ అక్ష‌త్‌ర‌నౌత్ వెడ్డింగ్ లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింద కంగ‌నా. ప్రీ వెడ్డింగ్‌, వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ లో నూత‌న వ‌ధూవ‌రుల‌తో క‌లిసి దిగిన ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ బ్యూటీ ఉద‌య్ పూర్ లో వెడ్డింగ్ స‌ర్మ‌నీలో సంద‌డి చేసిన త్రో బ్యాక్‌స్టిల్స్ ను అభిమానుల‌తో పంచుకుంది. అక్ష‌త్ ర‌నౌత్ సంగీత్ వేడుక‌లో రాజ‌స్థానీ జాన‌ప‌ద నృత్య‌కారుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ లోపోస్ట్ చేసింది. రాజ‌స్థాన్ జాన‌ప‌ద సంగీతాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. సంగీత్ వేడుక‌లో జాన‌ప‌ద క‌ళాకారుల బృందాన్ని అనుక‌రిస్తూ వేసిన స్టెప్పులు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి.

సిల్వ‌ర్ స్క్రీన్ పై కంగ‌నా డ్యాన్స్ ను మిస్స‌యిన  వారికి ఈ ఫొటోలు ఫుల్ జోష్ నంద‌స్తున్నాయి. గ‌త నెల‌లో సోద‌రుడి పెండ్లిలో మ‌ధుర‌మైన త్రోబ్యాక్ స్టిల్స్ అంటూ ఫొటోల‌కు క్యాప్స‌న్ ఇచ్చింది. ఏఎల్ విజ‌య్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న త‌లైవి చిత్రంలో కంగ‌‌నార‌నౌత్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మ‌రోవైపు తేజాస్ ప్రాజెక్టుతో బిజీగా మారింది కంగ‌నా.

ఇవి కూడా చదవండి..

ఎఫ్ 3 మూవీ..ఎవ‌రికెంత రెమ్యున‌రేష‌న్ తెలుసా...?

రోజా నన్ను అన్నయ్య అంటే పిచ్చెక్కేది: శ‌్రీకాంత్‌

బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ కు సీక్వెల్ రాబోతుందా..?

బాల‌కృష్ణ మూవీ షూటింగ్ ఎక్క‌డో తెలుసా..?

ఐ మిస్ యూ సుధీర్.. ఎమోషనల్ అయిన రష్మి గౌతమ్..

బిగ్ బాస్ నా కెరీర్ కు ప్ల‌స్ అయింది

ప్రభాస్ ఫామ్ హౌజ్‌లో మార్పులు..అసలు కారణం అదే..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo