గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 29, 2020 , 10:35:27

కంగ‌నాని దాటి చాలా ముందుకెళ్లాను: మాజీ ప్రియుడు

కంగ‌నాని దాటి చాలా ముందుకెళ్లాను: మాజీ ప్రియుడు

బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవ‌ల త‌న చెల్లి ఒక వ‌ర్గాన్ని కించ‌ప‌రుస్తూ చేసిన కామెంట్స్‌కి కంగ‌నా ర‌నౌత్ స‌పోర్ట్ చేయ‌డంతో ఆమెపై కేసు న‌మోదైంది. ఈ విష‌యంలో వారిద్ద‌రు కోర్టుకు కూడా హాజ‌రు కావ‌ల‌సి ఉంటుంది.

ఇదిలా ఉంటే కంగ‌నా ర‌నౌత్ గ‌తంలో అధ్యాయన్‌ సుమన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన విష‌యం తెలిసిందే. ప‌లు కార‌ణాల వ‌ల‌న ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చి విడిపోయారు. వీరి బ్రేకప్ సమయంలో ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈ విష‌యంపై తాజాగా స్పందించిన సుమ‌న్ .. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషం‍గా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త‌న‌కి మ‌ద్ద‌తుగా నిలిచిన టీవీ న‌టి క‌విత కౌషిక్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపాడు సుమ‌న్ 


logo