శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 13:13:02

తండ్రి అధికారం, డ‌బ్బు అడ్డుపెట్టుకొనే తాగుబోతు కాను: క‌ంగనా ఫైర్

తండ్రి అధికారం, డ‌బ్బు అడ్డుపెట్టుకొనే తాగుబోతు కాను: క‌ంగనా ఫైర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) తో పోల్చిన సంగ‌తి తెలిసిందే. కంగనా వ్యాఖ్య‌ల త‌ర్వాత ముంబై రానివ్వొద్దని  శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్ రౌత్ హెచ్చ‌రించారు. అంతేకాదు ఆమె ఆఫీసు అక్ర‌మ నిర్మాణ‌మంటూ కూల్చివేయించారు. ఈ ప‌రిణామాల మ‌ధ్య కంగ‌నా ర‌నౌత్ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు ఉద్ద‌వ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేసింది. దీనిపై మౌనం వీడిన ఉద్ద‌వ్‌..  కొంతమంది మహారాష్ట్ర బిడ్డలను, ముఖ్యంగా నా  కుమారుడు ఆదిత్యను కూడా దుర్భాషలాడారు. న్యాయం మా వైపే ఉంది.

బ‌తుకు తెరువు కోసం ముంబైకి  వచ్చిన కొంత‌మంది దీనిని పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ అంటూ కామెంట్స్ చేయ‌డం న‌గర ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తుంది. మ‌నం ఇంట్లో తుల‌సి మొక్క‌లు పెంచుతాం, గంజాయి కాదు. వారికి ఈ విష‌యం తెలియ‌దు అనుకుంటా. త‌మ రాష్ట్రంలో తిండికి గ‌తి లేక‌పోతే ఇక్క‌డ‌కు వ‌చ్చి డ‌బ్బులు సంపాదించుకుంటూ న‌గరం ప‌రువు తీస్తున్నారు. వారు న‌మ్మ‌క ద్రోహులుగా మిగిలిపోతారు అని ఉద్ద‌వ్ అన్నారు .

మహారాష్ట్ర సీఎం వ్యాఖ్య‌ల‌పై స్పందించిన కంగ‌నా ర‌నౌత్.. న‌న్ను న‌మ్మ‌క ద్రోహిఅని ఉద్ద‌వ్ అంటున్నారు. ముంబైలో నాకు షెల్ట‌ర్ ఇవ్వ‌క‌పోతే తిండి దొర‌క‌ద‌ని అన్నారు. స్వ‌యం ప్ర‌తిభ‌తో ఎదిగిన మ‌హిళ‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంటే బాధ‌గాఉంది. ముఖ్య‌మంత్రిగారు మీరు ఓ చెత్త నెపోటిజం ప్రొడ‌క్ట్‌.   మీలా తండ్రి అధికారం, డ‌బ్బు అడ్డుపెట్టుకునే తాగుబోతునైతే కాదు. వార‌స‌త్వం నేనున‌మ్ముకుంటే హ్యాపీగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనే ఉండేదాన్ని. మాది ఘ‌న‌మైన కుటంబం. వార‌స‌త్వం మీద‌, సంప‌ద మీద  ఆధార‌ప‌డ ఇష్టం లేక సొంత‌గా బతుకుతున్నాను. కొంత‌మందికి ఆత్మ‌గౌరవం, విలువలు ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుంటే మంచింది అని కంగ‌నా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డింది.