గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 15:05:40

సుశాంత్ సూసైడ్‌.. ఉద్ద‌వ్ ఠాక్రేను త‌ప్పుప‌ట్టిన కంగ‌నా ర‌నౌత్‌‌

సుశాంత్ సూసైడ్‌.. ఉద్ద‌వ్ ఠాక్రేను త‌ప్పుప‌ట్టిన కంగ‌నా ర‌నౌత్‌‌

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆధారాలు ఉంటే పోలీసుల‌కు ఇవ్వాలంటూ మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌జ‌ల్ని కోరిన విష‌యం తెలిసిందే. సుశాంత్ మృతి ప‌ట్ల సీఎం ఉద్ద‌వ్ స్పందించిన తీరును బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్‌ త‌ప్పుప‌ట్టింది.  సుశాంత్‌ కేసులో ఆధారాలు ఉంటే ఇవ్వండని ప్ర‌పంచ మేటి సీఎం ఉద్ద‌వ్‌ అడుగుతున్నార‌ని, అంటే ఇప్పుడు ప్ర‌జ‌లే సుశాంత్ మృతికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వాలా అని కంగ‌నా రనౌ‌త్ త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు. ముంబై పోలీసులు క‌నీసం క్రైమ్ సీన్‌ను కూడా సీజ్ చేయ‌లేద‌న్నారు. సంఘ‌ట‌న స్థ‌లం నుంచి వెంట్రుక‌లు, ఫింగ‌ర్ ప్రింట్స్ కూడా పోలీసులు తీసుకోలేద‌న్నారు. కానీ బెస్ట్ సీఎం ఉద్ద‌వ్ మాత్రం ప్ర‌జ‌ల నుంచి ఆధారాలు కోరుతున్నార‌ని కంగ‌నా ఆరోపించారు.

సినిమా ఇండ‌స్ట్రీ నుంచి సుశాంత్ వెళ్లిపోవాల‌ని అత‌ని స్నేహితుడు స‌మిత‌తో చెప్పార‌ని, సుశాంత్ ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోయాడ‌ని, త‌న‌ను చంపేందుకు కుట్ర జ‌రుగుతున్న‌ట్లు సుశాంత్ అత‌ని స్నేహితుడికి చెప్పాడ‌ని కంగ‌నా త‌న ట్వీట్లో పేర్కొన్న‌ది.  సుశాంత్‌ది సూసైడ్ అని సీఎం కేవ‌లం రెండు నిమిషాల్లోనే తేల్చేశార‌ని, కానీ మూవీ మాఫియా మాత్రం మాన‌సిక కోణాన్ని సాకుగా చూపుతున్న‌ద‌ని కంగ‌నా పేర్కొన్న‌ది. 


logo