ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 16, 2021 , 01:03:37

కశ్మీర్‌ రాణి పాత్రలో..

కశ్మీర్‌ రాణి పాత్రలో..

కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది సీనియర్‌ కథానాయిక కంగనారనౌత్‌. తాజాగా ఆమె ఓ చారిత్రక చిత్రంలో వీరనారి పాత్రను పోషించడానికి సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే...పదో శతాబ్దంలో కశ్మీర్‌ను పరిపాలించిన రాణీ దిద్దా వీరోచిత పోరాటగాథ ఆధారంగా  ‘మణికర్ణిక రిటర్న్స్‌ : ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా’ పేరుతో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. కమల్‌జైన్‌ నిర్మించబోతున్న ఈ చిత్రంలో కంగనారనౌత్‌ టైటిల్‌ రోల్‌ను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని కూడా చేపట్టబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ మొత్తం సిద్ధమైందని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. పోలియో వల్ల కలిగిన అంగవైకల్యంతో బాధపడుతూ కూడా తన శత్రువులపై వీరోచిత పోరాటం చేసిన పరాక్రమశీలిగా రాణి దిద్ద్దా కీర్తిని సంపాదించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించబోతున్నారు. కంగనారనౌత్‌ కథానాయికగా నటించిన ‘మణికర్ణిక’ (2019) చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా కంగనా కశ్మీర్‌ రాణి దిద్దా కథాంశాన్ని ఎంచుకుంది.

VIDEOS

logo