శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 17:08:08

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

చెన్నై : ప్ర‌ముఖ సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీధి మ‌య్యం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ కాలుకు సంబంధించిన శస్త్రచికిత్స విజ‌య‌వంతంగా పూర్త‌యింది. చెన్నైలోని శ్రీరామ చంద్ర హాస్ప‌ట‌ల్ నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు క‌మ‌ల్‌హాస‌న్‌. డిశ్చార్జ్ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి సిబ్బందితో క‌లిసి ఫొటోలు దిగారు. క‌మ‌ల్‌హాస‌న్ చాలా హుషారుగా న‌వ్వుతూ ఆస్ప‌త్రి టీంతో క‌లిసి దిగిన ఫొటోల‌ను ర‌మేశ్ బాలా ట్వీట్ చేశారు. క‌మ‌ల్‌హాస‌న్ కాలుకు విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ పూర్త‌యింది. ఇవాళ డిశ్చార్జ‌య్యారు. కొన్ని రోజులు విశ్రాంతి అవ‌స‌రమ‌ని వైద్యులు చెప్పార‌ని ట్వీట్ లో పేర్కొన్నారు.‌

కొన్ని సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన ప్ర‌మాదం కార‌ణంగా నా కాలుకు శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాన‌ని క‌మ‌ల్‌హాస‌న్ తెలిపారు. శ‌స్త్ర‌చికిత్స‌లో భాగంగా ఫాలో అప్ స‌ర్జ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. కొంత కాలం డాక్ట‌ర్లు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారని సోష‌ల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. ఆర్దోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ మోహ‌న్ కుమార్, డాక్ట‌ర్ జేఎస్ఎన్ మూర్ సారథ్యంలోని ఆస్ప‌త్రి బృందం క‌మ‌ల్‌హాస‌న్ కు స‌ర్జ‌రీ పూర్తి చేసింది. క‌మ‌ల్‌హాస‌న్ కు గ‌తంలోనే ప‌లు స‌ర్జ‌రీలు జ‌రిగాయి. క‌మ‌ల్ హాస‌న్ శ‌రీరంలో 16 ఫ్యాక్చ‌ర్స్ అయ్యాయి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo