e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News తమిళంలోనూ దృశ్యం 2..కమల్ హాసన్ ఫోక‌స్

తమిళంలోనూ దృశ్యం 2..కమల్ హాసన్ ఫోక‌స్

మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కమల్ హాసన్ చాలా డల్ అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఈయన మాత్రం మరింత జోరుగా పని చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును పూర్తిగా జీర్ణించుకున్నారు. అందుకే సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఓ ఓటమిని మరిచిపోవాలంటే పనిలో పడాలి. ఇప్పుడు ఇదే చేస్తున్నాడు కమల్. వరసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. గతంలో సినిమాలు చేయను.. రిటైర్మెంట్ ఇస్తున్నాను అంటూ ప్రకటించిన ఈయన.. ఇప్పుడు మాత్రం తీరిక లేనంత సమయం సినిమాలతోనే గడిపేస్తున్నాడు. ఎన్నికల కారణంగా మొన్నటి వరకు కూడా సినిమాలకు దూరంగా ఉన్న క‌మ‌ల్‌.. ఇప్పుడు కరోనా సమయంలోనూ రప్ఫాడిస్తున్నాడు.

శంకర్ దర్శకత్వంలో క‌మ‌ల్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమా ఆగిపోయింది. దాంతో పాటే మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో విక్రమ్ సినిమాకు కమిట్ అయ్యాడు కమల్ హాసన్. కెరీర్లో 232వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని హోమ్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. గతేడాది కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అప్పటి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఎన్నికల్లో తన ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ ప్రచారంలో బిజీ అయిపోయాడు కమల్. అందుకే షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు. ఈ మధ్యే ‘విక్రమ్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు కమల్ హాసన్.

- Advertisement -

ఈ సినిమా కోసం అంబు అరివి యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. లోకేష్ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కమల్. అంతేకాదు ఇప్పుడు మరో సినిమాకు కూడా కమిట్ అవ్వాలని చూస్తున్నాడు. అదే దృశ్యం 2. తమిళంలో పాపనాశం పేరుతో కొన్నేళ్ళ కింద రీమేక్ చేసాడు కమల్. అక్కడ క‌మ‌ల్ సరసన గౌతమి నటించింది. అయితే ఇప్పుడు ఆమె కాకుండా ఒరిజినల్ లో నటించిన మీనాతోనే జోడీ కట్టాలని చూస్తున్నాడు కమల్ హాసన్. త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి..

పంజాబీ సినిమాల‌పై ఆర్ఎక్స్ 100 భామ ఫోక‌స్‌..!

మ‌హేశ్, ప్ర‌భాస్ గురించి సుబ్బ‌రాజు ఏమ‌న్నాడంటే..?

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

విజ‌య్ సేతుప‌తితో ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌లు..!

అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!

టాలీవుడ్ క‌మ్ బ్యాక్ త్వ‌ర‌లో..కైరా ట్వీట్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana