శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 04, 2020 , 11:11:58

మోదీ పిలుపుపై మండిప‌డ్డ క‌మ‌ల్ హాస‌న్

మోదీ పిలుపుపై మండిప‌డ్డ క‌మ‌ల్ హాస‌న్

భార‌త ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ నిన్న ఉద‌యం అంద‌రు ఊహించని విధంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 5 రాత్రి 9 గం.ల‌కి ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి  9నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్ర‌జ‌ల‌ని కోరారు. ఈ వెలుగులో క‌రోనా చీక‌ట్ల‌ని తొల‌గించాలని పిలుపు నిచ్చారు. అయితే మోదీ స్టేట్‌మెంట్‌ని  ప‌లువురు ప్ర‌ముఖులు ఖండిస్తున్నారు.

మక్కల్ నీది మయ్య‌మ్‌ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా మోదీ కామెంట్స్ పై మండిప‌డ్డారు. అంద‌రం విపత్క‌ర ప‌రిస్థితుల‌పై దిశా నిర్ధేశం చేస్తార‌ని ఊహించాం. పేద‌ల‌కి జీవ‌నాధారం, ఆర్ధిక మాంద్యం, వ‌స్తువుల ల‌భ్య‌త గురించి మాట్లాడుతార‌ని అనుకున్నాం. కాని మేమెప్పుడో ప్రారంభించిన టార్చ్‌లైట్ పోరాటం గురించి మాట్లాడారు అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు క‌మ‌ల్‌. మక్కల్ నీది మయ్య‌మ్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ అన్న సంగ‌తి తెలిసిందే.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo