మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 14:37:10

వెంటిలేట‌ర్‌పై విల‌న్‌.. సాయం చేసిన క‌మ‌ల్ హాస‌న్

వెంటిలేట‌ర్‌పై విల‌న్‌.. సాయం చేసిన క‌మ‌ల్ హాస‌న్

ప‌లు చిత్రాల‌లో విల‌న్‌గా న‌టించి అల‌రించిన పొన్నంబ‌ళ‌మ్ కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధింత స‌మస్య‌ల‌తో చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని తెలుసుకున్న క‌మ‌ల్ హాస‌న్ కొంత డ‌బ్బు సాయం చేస్తాన‌ని మాట ఇచ్చార‌ట‌. అంతేకాదు ఆయ‌న పిల్ల‌ల చ‌దువు ఖ‌ర్చుల‌ని కూడా తానే భ‌రిస్తాన‌ని అన్నార‌ట‌. 

క‌మ‌ల్ హాస‌న్‌తో క‌లిసి 'అపూర్వ సా‌గోధ‌రార్గ‌ల్‌', 'మైకేల్ మ‌ద‌న కామ‌రాజ‌న్' వంటి చిత్రాల్లో న‌టించారు పొన్నంబ‌ళ‌మ్. ర‌జినీకాంత్ న‌టించిన‌ 'ముత్తు', 'అరుణాచ‌లం', అజిత్ 'అమ‌ర్క‌ల‌మ్'‌, విక్ర‌మ్ 'సామి' వంటి చిత్రాల్లో క‌నిపించారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఓ వీడియో ద్వారా వివ‌రించిన పొన్నంబ‌ళ‌మ్ ప్ర‌స్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. బిగ్ బాస్ రెండో సీజ‌న్‌లోను పాల్గొన్న ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు .


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo