డైరెక్టర్ ప్రియదర్శన్ (Priyadarshan) కూతురిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది మలయాళ ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ భామ ఆ తర్వాత చిత్ర లహరి, రణరంగం సినిమాలు చేసింది. అనంతరం మలయాళం, తమిళ చిత్రాలతో బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
కల్యాణి త్వరలోనే బాలీవుడ్ (Bollywood) తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇపుడు ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. కల్యాణి తన తండ్రి ప్రియదర్శన్ మద్దతు లేకుండానే స్వంతంగా హిందీలో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతుండటం విశేషం. హేరా పేరి, హంగామా, భూల్ భూలయ్యా, హంగామా, మాలమాల్ లాంటి కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించి హిందీలో మంచి పాపులారిటీ సంపాదించారు ప్రియదర్శన్. ఈ డైరెక్టర్ కు బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు దర్శకనిర్మాతలతో మంచి పరిచయాలున్నాయి. కల్యాణి మాత్రం తండ్రి సాయం తీసుకోకూడదనుకుంటుందట.
న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ డిజైనింగ్ లో డిగ్రీ చేసింది కల్యాణి. ఎవరికీ తెలియని విషమేంటంటే కల్యాణి యాక్టింగ్ లోకి ప్రవేశించే ముందు హృతిక్ రోషన్ క్రిష్ 3, విక్రమ్ ఇరుముగన్ సినిమాలకు అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసింది. మొత్తానికి సొంతంగా హిందీలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న కల్యాణి ప్రియదర్శన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు మూవీ లవర్స్.
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!