శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 10:58:36

చాలా రోజుల తర్వాత ఫ్యామిలీని కలుసుకున్న కళ్యాణ్‌దేవ్

చాలా రోజుల తర్వాత ఫ్యామిలీని కలుసుకున్న కళ్యాణ్‌దేవ్

హైదరాబాద్‌ : మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ చాలా రోజుల తరువాత తన కుటుంబానికి దగ్గరయ్యాడు. లాక్‌డౌన్ సడలింపులో భాగంగా ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్‌లో పాల్గొన్న కొందరు నటీనటులు కరోనా బారిన పడ్డారు. అయితే గత నెల కళ్యాణ్‌దేవ్ కూడా తన రెండో సినిమా సూపర్‌ మచ్చి షూటింగ్ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లాడు. షూటింగ్‌లో పాల్గొన్నన్ని రోజులు కళ్యాణ్‌ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. కరోనా భయంతో ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని కళ్యాణ్‌దేవ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

షూటింగ్ ముగిసిన తరువాత కరోనా టెస్టులు చేయించుకుని నెగిటివ్ నిర్ధారణ అయిన తర్వాతే కుటుంబానికి దగ్గరయ్యాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ ఫోటోని కూడా షేర్ చేశాడు. తనకు తానే ఇన్ని రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని ఇక ఎలాంటి వైరస్ లేదని తెలియడంతో మళ్లీ ఫ్యామిలీని కలుసుకున్నానని చెప్పాడు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo