శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 16:54:23

మెగా అల్లుడికి నెగెటివ్‌.. ఆనందంలో కుటుంబ స‌భ్యులు

మెగా అల్లుడికి నెగెటివ్‌.. ఆనందంలో కుటుంబ స‌భ్యులు

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు విజేత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండో సినిమాగా సూప‌ర్ మ‌చ్చీ అనే చిత్రం చేస్తున్నాడు. క‌రోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ కొద్ది రోజుల క్రితం చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు క‌ళ్యాణ్ దేవ్‌. ఆ రోజు నుండి త‌న ఫ్యామిలీ స‌భ్యుల‌కి దూరంగా ఉంటున్నాడు. క్వారంటైన్ టైం పూర్త‌యిన త‌ర్వాత ప‌రీక్షలు జ‌రుపుకోగా, నెగెటివ్ రావ‌డంతో ఫుల్ హ్యాపీగా ఫీల‌య్యారు .

క‌రోనాకి సంబంధించిన జరిపిన ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చిన ఆనందంతో భార్య శ్రిజతో పాటు పిల్లలను దగ్గరకు తీసుకొని సెల్ఫీ దిగాడు. నెగెటివ్ అని తెలిసిన త‌ర్వాత పిల్ల‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ళాన‌ని చెప్పిన క‌ళ్యాణ్ దేవ్‌.. ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా పిల్లలకు పెద్ద వారికి దూరంగా ఉండాలంటూ త‌న పోస్ట్ ద్వారా తెలిపాడు. ఆరోగ్యంగా ఉండాలంటే సామాజిక దూరం త‌ప్ప‌క పాటించాల‌ని ఆయ‌న పేర్కొన్నాడు 


logo