మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 12:47:45

సుశాంత్ శ‌రీరంలో విష ప‌దార్ధాలు లేవ‌ని అప్పుడే చెప్పాం..

సుశాంత్ శ‌రీరంలో విష ప‌దార్ధాలు లేవ‌ని అప్పుడే చెప్పాం..

మంచి భ‌విష్య‌త్ ఉన్న బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణంపై అనేక అనుమానాలు నెల‌కొని ఉన్న నేప‌థ్యంలో సుశాంత్ కుటుంబ స‌భ్యులు ఇది ఆత్మ‌హ‌త్య కాదు, హ‌త్యే అని బీహార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత ఈ కేసు సీబీఐకి చేరింది. ఎయిమ్స్ ప్యానెల్‌, సీబీఐ క‌లిసి కేసుని స్ట‌డీ చేస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌ మృతదేహంలో ఎలాంటి విష ప‌దార్ధాలు లేవని , ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్‌ వర్గాలు ధృవీకరించాయి.

మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని ఎయిమ్స్ చెబుతుండ‌గా, ముంబైకు చెందిన కలినా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కూడా సుశాంత్ మృతి కేసుపై స్పందించింది. జూన్‌లో మేము అందించిన రిపోర్ట్‌లో సుశాంత్ శ‌రీరంలో విష ప‌దార్ధాలు కాని ఎలాంటి ర‌సాయ‌నాలు లేవ‌నే చెప్పాము అని స్ప‌ష్టం చేశారు.  మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. అయితే ఈ కేసుపై ఇప్పుడే నివేదిక‌ను త‌యారు చేయ‌మ‌ని, డీఎన్ఏను పూర్తిగా ప‌రిశీలించాకే స‌మర్పిస్తామ‌ని సీబీఐ అంటుంది. అయితే సుశాంత్ లాయ‌ర్ మాట్లాడుతూ.. నా క్లైంట్ ఉరివేసుకొని చ‌నిపోలేదు, ఉరి వేసి చంపేశారు అని అన్నారు


logo