రోహిత్( ‘6టీన్స్’ ఫేమ్) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కళాకార్’. వెంకటరెడ్డి జాజాపురం నిర్మాత. శ్రీను బందెల దర్శకుడు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్‌రావిపూడి విడుదలచేశారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘ఇందులో మహేంద్రవర్మ అనే పోలీస్ అధికారిగా నేను కనిపిస్తా. నిజాయితీపరుడైన అతడికి వృత్తినిర్వహణలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన రోహిత్ ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో టీజర్‌ను విడుదలచేస్తాం’ అని తెలిపారు. షాయాజీ షిండే, పృథ్వీరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: చిన్నా, సంగీతం: కనిష్క, సినిమాటోగ్రఫీ: అమర్.