కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా కాల్షీట్స్ ఖాళీ లేకుండా సినిమాలు చేస్తుంది. కాజల్ నటించిన ఆచార్య సినిమా విడుదలకి సిద్థం కాగా, ఇప్పుడు ఉమ అనే హిందీ చిత్రం చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతుంది. అయితే ఉమ షూటింగ్ బ్రేక్‌లో కాజల్ అగర్వాల్ తన కుటుంబసభ్యులతో కలిసి దక్షిణేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను కాజల్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.
కాజల్ తమిళంలో ‘రౌడీ బేబీ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె ఓ అమ్మాయికి తల్లిగా సత్తా వున్న క్యారెక్టర్ చేయనుందని తెలుస్తోంది. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయనుంది కాజల్.