బుధవారం 03 జూన్ 2020
Cinema - May 09, 2020 , 12:48:26

వెరైటీ వంటకాల‌తో నోరూరిస్తున్న కాజ‌ల్

వెరైటీ వంటకాల‌తో నోరూరిస్తున్న కాజ‌ల్

లాక్‌డౌన్‌కి ముందు మేక‌ప్‌లు వేసుకొని సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే హీరోయిన్స్ ఇప్పుడు ఇంటికి ప‌రిమిత‌మై వెరైటీ వంట‌కాలు చేస్తున్నారు. రాక‌పోయిన కూడా నేర్చుకొని మ‌రీ చేస్తున్నారు. తాజాగా క‌లువుక‌ళ్ల సుంద‌రి కాజ‌ల్‌.. త‌న పేరేంట్స్ కోసం ఆంధ్రా వంట‌కాలైన బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి చేసాన‌ని చెప్పుకొచ్చింది. వాటితో పెస‌ర‌ట్టు కూడా చేసిన‌ట్టు స్ప‌ష్టం చేసింది

త‌న వంట‌ల‌కి పేరెంట్స్ ఫుల్ మార్కులు ఇచ్చార‌ని సంతోష‌ప‌డుతున్న కాజ‌ల్ సినిమా షూటింగ్స్‌ని చాలా మిస్ అవుతున్న‌ట్టు త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలియ‌జేసింది. లాక్‌డౌన్ త‌ర్వాత కాజ‌ల్.. ఇండియ‌న్ 2 సినిమాతో పాటు చిరు ఆచార్య టీంతో క‌ల‌వ‌నుంది. వీటితో పాటు ఉదయనిధి స్టాలిన్ మూవీ, రమేష్ అరవింద్ దర్శకత్వం లో రూపొందుతున్న‌ పారిస్ పారిస్ చిత్రాల్లో నటిస్తుంది.  ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే పదముడేళ్ళు పూర్తి చేసుకున్న కాజ‌ల్‌.. టాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే.. అటు బాలీవుడ్, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం కాజల్ 'భారతీయుడు 2' సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది.ఉదయనిధి స్టాలిన్ మూవీలో నటిస్తుంది.. ఇందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రమేష్ అరవింద్ దర్శకత్వం లో పారిస్ పారిస్ చిత్రాల్లో నటిస్తుంది.


logo