ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 10, 2020 , 15:16:10

కిచెన్‌లో కాజ‌ల్‌.. స‌మోసా ఎలా ఉందంటూ ట్వీట్

కిచెన్‌లో కాజ‌ల్‌.. స‌మోసా ఎలా ఉందంటూ ట్వీట్

ఎప్పుడు మేక‌ప్‌లు వేసుకొని కెమెరా ముందు న‌ట విన్యాసాన్ని ప్ర‌ద‌ర్శించే భామ‌లు ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే పరిమిత‌మ‌య్యారు. ఈ ఖాళీ స‌మ‌యాల్లో ఏం చేయాలో తెలియ‌క గ‌రిట ప‌ట్టి వంటలు చేయ‌డం నేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే త‌న భ‌ర్త కోసం ప‌లు ర‌కాల వంటలు నేర్చుకొని అందరికి నోరూరింప‌జేస్తుంది.

తాజాగా క‌లువ‌క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్‌.. పిండి వంటలు చేస్తోంది. ఎంతో క‌ష్ట‌ప‌డి స‌మోసా త‌యారు చేసిన ఈ అమ్మ‌డు దానికి సంబందించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. మొదటి సారి చేశానని.. అది పంజాబీ స్టైల్ సమోసాను చేశానని గర్వంగా చెప్పుకుంది. అంతేకాదు ఆ సమోసాలను పట్టుకుని ఓ ఫోటో కూడా దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. కాజ‌ల్ స‌మోసాపై నెటిజ‌న్స్ కుప్ప‌లుతెప్ప‌లుగా కామెంట్స్ చేస్తున్నారు.  కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం చిరంజీవి 152వ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo