మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 11:47:17

త‌న పెళ్లి డేట్ ప్ర‌క‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్

త‌న పెళ్లి డేట్ ప్ర‌క‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్

కలువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లికి సంబంధించి గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్రేమించిన వ్య‌క్తితో నిశ్చితార్ధం కూడా జ‌రుపుకుంద‌ని, త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే కాజ‌ల్ చేసుకోబోయే వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యం మొన్న‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ ఉండ‌గా, తాజాగా ఆ వ్య‌క్తికి సంబంధించిన వివ‌రాలు కూడా లీక‌య్యాయి. 

కాజ‌ల్‌.. ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. కొంత కాలంగా వీరిద్ద‌రు ప్రేమించుకుంటున్నార‌ని, పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మయ్యార‌ని స‌మాచారం. క‌ట్ చేస్తే కాజ‌ల్ పెళ్ళికి సంబంధించి ప‌లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ అమ్మ‌డు స్పందిస్తుందా లేదా అని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో గ‌త రాత్రి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. చీక‌ట్లో వెలుగుని తీసుకొస్తున్న‌ట్టు బ్లాక్ క‌ల‌ర్‌పై వైట్ హార్ట్ సింబ‌ల్ ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. అంతేకాదు గౌత‌మ్ ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా కాజ‌ల్ కొన్నాళ్ళుగా ఫాలో అవుతున్న నేప‌థ్యంలో ఇద్ద‌రి పెళ్ళి మేట‌ర్‌లో నిజం ఉంద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డ్డారు.

కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాజ‌ల్ త‌న పెళ్లి విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 30న గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలిపింది. క‌రోనా మ‌హమ్మారి వ‌ల‌న కొద్ది మంది స‌భ్యుల మ‌ధ్య పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు పేర్కొంది. ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తూ నాపై ప్రేమ‌ను చూపిస్తున్న మీ అంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని కాజ‌ల్ పేర్కొంది. కాగా, ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.  

కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పంచారు. కాగా కాజల్‌ చెల్లి ఇషా అగర్వాల్‌  ఏడేళ్ల కిత్రమే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
logo