ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు టీఆర్టీ, టెట్ స్టడీ మెటీరియల్అందజేత
జిల్లాకు పేరు తీసుకురావాలి : ఎమ్మెల్యే కోనప్ప
కాగజ్నగర్టౌన్, మార్చి 29 : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కా ర్యాలయంలో కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఆర్టీ, టెట్ ఉచిత శిక్షణ కేంద్రంలో 7 సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్డీపీవో బాలస్వామి ఐపీఎస్, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో కలిసి అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ ఉద్యోగమే లక్ష్యంగా చదివి తల్లిదండ్రులు, గురువులకు, నియోజకవర్గానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించా రు. కాగజ్నగర్ ఎస్డీపీవో బాలస్వామి ఐపీఎస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు సహాయ సహకారాలు అందిస్తామన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గణపురం శ్రీనివాస్, శివ, కాసం శ్రీనివాస్, అధ్యాపకులు లక్ష్మీనర్సింహం, పూర్ణచందర్రావు, శంకర్, మధుకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మినీ స్టేడియంలో..
కౌటాల, మార్చి 29 : మండలకేంద్రంలోని మినీ స్టేడియంలో టెట్, టీఆర్టీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే కోనప్ప స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తామని, ఆసక్తి, అర్హత గల వారు ఏప్రిల్ 1 నుంచి 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అనూ పబ్లికేషన్స్ డైరెక్టర్ శివయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, కౌటాల, చింతలమానేపల్లి మండలాల ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ అలీ, నాజీం హుస్సేన్, సర్పంచ్లు వొజ్జల మౌనిశ్, సోమయ్య, వి శ్రాంత ఉద్యోగులు రాధా కిషన్, సాంబశివరావు, రమేశ్, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు గుర్రం శ్రీధర్ , డబ్బా బాపు, అశోక్, పవన్, మల్లేశ్, బ్రహ్మయ్య, నీలాగౌడ్ న్నారు.
ఇవి కూడా చదవండి
పెళ్లైన తర్వాత తొలి హోలీ.. పిక్ షేర్ చేసిన కాజల్
రేప్ బాధితురాలు, నిందితుడిని తాళ్లతో కట్టేసి ఊరేగించారు..