e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home సినిమా ‘ఖైదీ’ రీమేక్‌లో?

‘ఖైదీ’ రీమేక్‌లో?

‘ఖైదీ’ రీమేక్‌లో?

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘సింగం’ సినిమా కోసం అజయ్‌దేవ్‌గణ్‌తో తొలిసారి జోడీకట్టింది దక్షిణాది సోయగం కాజల్‌ అగర్వాల్‌. పదేళ్ల తర్వాత ఈ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. కార్తి కథానాయకుడిగా తమిళంలో విజయవంతమైన ‘ఖైదీ’ చిత్రం హిందీలో పునర్నిర్మితమవుతోంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తుండగా..ఆయన సరసన నాయికగా కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌ పాత్రకు స్థానం లేదు. అయితే బాలీవుడ్‌ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. హీరో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించినట్లు చెబుతున్నారు. ఆ సన్నివేశాల్లో అజయ్‌దేవ్‌గణ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్‌ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘ఖైదీ’ రీమేక్‌లో?

ట్రెండింగ్‌

Advertisement