నామినేషన్ సమయంలో జరిగిన గొడవలు సమసిపోయేలా చేసేందుకు హౌజ్‌మేట్స్ ప్రయత్నించారు. నామినేషన్ సమయంలో తనని కాజల్ ఫిజికల్‌గా కొట్టిందని చెబుతూ రవి నామినేట్ చేశాడు. దీనిపై కాజల్ బాగా హర్ట్ అయింది. రవి.. కాజల్‌తో మాట్లాడేందుకు దగ్గరకు రాగా.. ప్లీజ్ రవి.. నీతో నాకు మాట్లాడలని లేదు. ఫిజికల్ అని అంటావా? ఏమనుకోవాలి? నువ్ నాతో మాట్లాడకు రవి అంటూ అక్కడ నుంచి లేచి లోపలికి వెళ్లిపోయి బోరు బోరున ఏడ్చేసింది.
నాకు తలపై కొడితే వెంటనే కోపం వచ్చేస్తుంది.. నేను ఆమె జుట్టుపట్టుకున్నా.. తను వద్దని అన్నది.. ఆ తరువాత వదిలేశా అని మానస్ దగ్గర చెప్పాడు రవి. ఇక జెస్సీ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ని బయటకు తీసాడు. శ్వేతని గార్ల్ఫ్రెండ్గా ఓ టాస్క్ ఇవ్వాలని బిగ్ బాస్‌కి ఏకరువు పెట్టాడు. ‘నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్‌బాస్.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్ సాంగ్ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. జెస్పీ మాటలకు శ్వేత తెగ నవ్వేసింది
ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులకు.. పెద్ద షాక్ ఇచ్చాడు. హౌజ్‌మేట్స్ అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఇంట్లోని ఫుడ్‌ని అజ్ఞాతవ్యక్తులతో బయటకు పంపాడు. ఇంట్లో మిగిలిఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకురావాల్సిందిగా కెప్టెన్ జెస్సిని బిగ్ బాస్ ఆదేశించడంతో చేసేదేమిలేక తినే తిండిని ఇచ్చేశారు కంటెస్టెంట్స్. లోబో అయితే ఆపిల్‌ని దాచుకొని మరి తింటూ చివరకు ఇచ్చాడు. సన్నీ కూడా దాచుకున్న ఫుడ్‌ని చాటున తిన్నాడు.