గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 10:01:35

కాబోయే భ‌ర్త‌తో కాజ‌ల్‌.. ఫొటో చ‌క్క‌ర్లు

కాబోయే భ‌ర్త‌తో కాజ‌ల్‌.. ఫొటో చ‌క్క‌ర్లు

సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్. ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో త‌న న‌ట‌ ప్ర‌స్థానం కొన‌సాగించిన కాజ‌ల్ చంద‌మామ సినిమాతో తొలి హిట్ పొందింది. అక్క‌డి నుండి ఇక వెనుక తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలంద‌రితోను న‌టించి అదుర్స్ అనిపించింది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2 సినిమాతో పాటు ప‌లు సినిమాలు చేస్తుంది.

35 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న కాజ‌ల్ పెళ్ళెప్పుడు చేసుకుంటుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్న స‌మ‌యంలో రీసెంట్‌గా బిగ్  స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను అక్టోబర్ 30న వివాహ‌మాడ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. వీరి వెడ్డింగ్ కేవ‌లం కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు, అతికొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నుంది. తాజాగా కాజ‌ల్‌, గౌత‌మ్‌కు సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుండే స్నేహితులు కాగా, కొన్నాళ్ల త‌ర్వాత స్నేహం ప్రేమ‌గా మారింది. 


logo