సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాగే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోతూ ఉంటాయి. ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్లు దర్శక నిర్మాతలు కూడా మారాల్సిందే. ఎవరేమనుకున్నా చివరికి వాళ్లు చెప్పిందే వేదం. ఇప్పుడు కొందరు హీరోయిన్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఒకప్పుడు పెళ్లయిన హీరోయిన్స్ ను ప్రేక్షకులు చూడరు అని దర్శక నిర్మాతలు వాళ్ళను దూరం పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెళ్లయినా.. పిల్లలకు తల్లయినా హీరోయిన్స్ మాత్రం వాళ్ల సత్తా చూపిస్తున్నారు. అలాగే స్టార్స్ గా కొనసాగుతున్నారు. సమంత పెళ్లి ముందు వరకు తెలుగు ఇండస్ట్రీలో కూడా పరిస్థితులు ఇలాగే ఉండేవి. పెళ్లి అయిపోతే ఇక ఆ హీరోయిన్లను పూర్తిగా దూరం పెట్టేవాళ్ళు దర్శకులు.
ఒకవేళ అవకాశాలు వచ్చినా కూడా మెయిన్ రోల్స్ మాత్రం కాదు. కానీ సమంత అక్కినేని ఈ రూల్స్ ని బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా ఉండొచ్చని ఆమె నిరూపించింది. ఈమె పెళ్లి తర్వాతే రంగస్థలం, ఓ బేబీ, మజిలీ, యూ టర్న్ అలాంటి సినిమాలు విడుదలయ్యాయి. తమిళంలో కూడా సినిమాలు చేసింది సమంత. ఇప్పటికీ సమంతకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే దారిలో కాజల్ అగర్వాల్ కూడా నడుస్తుంది. గతేడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్.. పెళ్లి తర్వాత కూడా అదే జోరు చూపిస్తుంది. ఇప్పటికీ ఈమెకు అవకాశాలు తగ్గలేదు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవి ఆచార్య, తమిళంలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలలో నటిస్తుంది కాజల్ అగర్వాల్. తాజాగా ఈమెకు మరో అవకాశం వచ్చింది.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా హీరోగా తమిళ దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించబోయే రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ లో కాజల్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. పెళ్లి తర్వాత అఫీషియల్ గా ఈమె సైన్ చేసిన తొలి సినిమా ఇదే. ప్రభుదేవా సినిమా మాత్రమే కాదు మరో రెండు సినిమాలకు కూడా కాజల్ కమిట్మెంట్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను అనే ఒప్పందం పైనే గౌతమ్ తో ఏడడుగులు నడిచింది ఈ చందమామ. ఇన్ని రోజులు కేవలం బాలీవుడ్ లో మాత్రమే పెళ్లి అయిన హీరోయిన్లు స్టార్స్ గా కొనసాగారు. అక్కడ విద్యా బాలన్, కరీనా కపూర్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా వీళ్లంతా పెళ్లి తర్వాత కూడా సత్తా చూపించారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ శకం మొదలైంది. అందుకే పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయనే భయం హీరోయిన్లలో కూడా తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి..
మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
కీర్తిసురేశ్ లుక్ మహేశ్‌బాబు కోసమేనా..?
మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఏ1 ఎక్స్‌ప్రెస్ రివ్యూ
- నలుగురితో పారిపోయి.. లక్కీ డ్రాలో ఒకరిని పెండ్లాడింది
- కూతురిని వేధిస్తున్న యువకుడికి మందలింపు : మహిళను కాల్చిచంపిన ఆకతాయి!
- పసిబిడ్డలకు ఉరేసి.. తానూ ఉసురు తీసుకుని..!
- తీరానికి కొట్టుకొచ్చిన.. 23 అడుగుల మిస్టరీ సముద్ర జీవి
- కరోనా టీకా వేయించుకున్న రాజస్థాన్ సీఎం
- కివీస్‌తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్‌కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..