ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, కాంట్రవర్సీ, ఎఫైర్స్ అన్నీ ఐదు రెట్లు ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ప్రారంభానికి ముందు ఫైవ్ మచ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నాగ్ తెలియజేయగా, ఇప్పుడు అది కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 ఐదు వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ వారం నామినేషన్లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. నేడు ఒకరిని ఎలిమినేట్ చేస్తారా లేక ఇద్దరినా అనేది తెలియాల్సి ఉంది.
రాజా రాజా ది గ్రేట్ రా సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అలరించారు. అనంతరం శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌ని మన టీవీలో చూపించారు. అందరు కలిసి జైల్లో వేయడాన్ని కాజల్ జీర్ణించుకోలేకపోయింది. ఇక జెస్సీ.. కాజల్‌తో మాట్లాడుతూ.. హమీదా నీపై నీళ్లు పోసినందుకు గట్టిగా ఇవ్వాల్సింది అన్నాడు. దీనికి కాజల్.. అక్కా అని పిలిచినందుకు ఏమి అనలేకపోయాను అని చెప్పింది.
ఇక రవి.. మానస్‌తో మాట్లాడుతూ కాజల్ సింపథీ కార్డ్ వాడుతున్నట్టు అనిపిస్తుందని చెప్పగా, ఇదే విషయాన్ని తీసుకెళ్లి కాజల్ దగ్గర ఊదాడు మానస్. రవి అందరికి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడా అనిపిస్తుందని మానస్ అనగా, దానికి స్పందించిన కాజల్.. నా వెనక ఇంత కుట్ర జరుగుతుందా అని పేర్కొంది.