శనివారం 30 మే 2020
Cinema - May 03, 2020 , 08:00:23

చిరు సినిమాపై స్పందించిన కాజ‌ల్‌

చిరు సినిమాపై స్పందించిన కాజ‌ల్‌

చిరంజీవి కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ (2017)లో క‌థానాయిక‌గా న‌టించిన కాజ‌ల్ ఇప్పుడు ఆచార్యలో హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా కాజ‌ల్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.ఈ నేప‌థ్యంలో కాజ‌ల్   ఈ వార్త‌ల‌ని కొట్టిపారేశారు. మ‌రోసారి చిరు స‌ర‌స‌న న‌టించేందుకు ఆమె ఎంతో ఉత్సాహం చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు.

కొర‌టాల శివ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు సగం వరకు పూర్తయింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదాపడింది. ఆగ‌స్ట్‌లో మూవీ ప‌ట్టాలెక్కే ఛాన్స్ క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి అంద‌మైన బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.


logo