టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జూన్ 19న తన 36వ బర్త్‌డే జరుపుకుంది. కరోనా వలన ఎవరిని ఆహ్వానించని ఈ ముద్దుగుమ్మ తన భర్త గౌతమ్ కిచ్లు, చెల్లెలు నిషా సమక్షంలో కేక్ కట్ చేసింది. ఇది కాజల్‌కి పెళ్లైన తర్వాత తొలి బర్త్‌డే కాగా, దీనిని చాలా స్పెషల్‌గా భావిస్తుంది. ప్రస్తుతం కాజల్ బర్త్‌డే పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
కాజల్ ప్రస్తుతం ఆచార్య చిత్రంతో పాటు కమల్ భారతీయుడు 2 చిత్రం చేస్తుంది. మరో వైపు వెబ్ సిరీస్‌లలోను నటిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా జోరు కొనసాగిస్తున్న కాజల్‌కు ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు వస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ‘మెర్సల్’ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. ఎమ్మెల్యే, కవచం, సీత, మోసగాళ్లు సినిమాలు సరిగా ఆడలేదు. ప్రస్తుతం ఆచార్య చిత్రంపై బోలెడన్నిఆశలు పెట్టుకుంది కాజల్.