శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 10:52:39

కాజ‌ల్ హ‌నీమూన్ పిక్.. వైర‌ల్‌గా మారిన ఫొటో

కాజ‌ల్ హ‌నీమూన్ పిక్.. వైర‌ల్‌గా మారిన ఫొటో

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ అక్టోబ‌ర్ 30న త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని పెళ్ళాడిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వల‌న కొద్ది మంది స‌మ‌క్షంలోనే ఈ వివాహ వేడుక జ‌రిగింది. పెళ్లైన వారం త‌ర్వాత నూత‌న దంప‌తులు హ‌నీమూన్ కోసం మాల్దీవుల‌కి వెళ్ల‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి అందాల‌ను త‌మ సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వ‌స్తున్నారు. 

తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న హ‌నీమూన్ ఆల్భ‌మ్‌లో భాగంగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫొటోని షేర్ చేసింది. పూల్‌లో కూర్చొని ఫుడ్‌ని ఆస్వాదిస్తున్న ఫొటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక కాజ‌ల్ సినిమాల విష‌యానికి వస్తే ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో పాటు భార‌తీయుడు 2, ముంబై సాగా, పారిస్ పారిస్ అనే సినిమాలు చేస్తుంది. 


logo