శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 11:45:14

ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన కాజ‌ల్

ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన కాజ‌ల్

అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్ అక్టోబ‌ర్ 30న త‌న చిన్న‌నాటి స్నేహితుడు, ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. కరోనా వ‌ల‌న కొద్దిమంది స‌భ్యుల మ‌ధ్య‌నే కాజల్ పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది. పెళ్ళికి సంబంధించిన షాపింగ్స్ తో బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజాగా త‌న చేతికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించి అందరికి షాకిచ్చింది.

చ‌డీచ‌ప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కాజ‌ల్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో  'షాదీ వానిటీ' అని  కామెంట్ పెట్టింది. ఇక అక్టోబ‌ర్ 30న జ‌ర‌గ‌నున్న కాజ‌ల్ పెళ్ళికి మీడియా క‌వ‌రేజ్ ఉండ‌ద‌ని తెలుస్తుండ‌గా, పెళ్లైన మూడు రోజుల‌కు ఫోటోలు రిలీజ్ చేస్తార‌ని టాక్. కాజ‌ల్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2, మోసగాళ్లు అనే సినిమాల‌తో పాటు లైవ్ టెలీకాస్ట్ అనే వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉంది.