శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Feb 21, 2020 , 23:22:10

అను అంతరంగం

అను అంతరంగం

‘మంచి, చెడు అనేవి పరిస్థితులను బట్టి మన దృష్టి కోణంపై ఆధారపడి ఉంటాయి.  ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మన అంతరాత్మ మీద ఆధారపడి ఉంటుంది’ అని అంటున్న ఓ యువతి  కథేమిటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ జీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  వయామార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏవీఏ బ్యానర్స్‌ పతాకాలపై విరోనికా మంచు నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌, రుహానిసింగ్‌ కథానాయికలు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం  కాజల్‌  ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది.  సినిమాలో అను అనే యువతిగా తాను నటిస్తున్నట్లు కాజల్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ‘గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కాజల్‌ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. దేశంలో జరిగిన ఓ పెద్ద ఐటీ స్కామ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.  వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల  ముందుకురానున్నది. 


logo