గురువారం 26 నవంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 16:52:49

కొన్ని గంట‌ల్లో వెడ్డింగ్‌.. కాజ‌ల్ ఇలా

కొన్ని గంట‌ల్లో వెడ్డింగ్‌.. కాజ‌ల్ ఇలా

హైద‌రాబాద్: కాజ‌ల్ క‌ళ్యాణ ఘ‌డియ‌లు స‌మీపిస్తున్నాయి. ఇక పెళ్లి టెన్ష‌న్‌ను ఆ భామ త‌ట్టుకోలేక‌పోతున్న‌ది.  ఇవాళ రాత్రి జ‌రిగే వివాహ వేడుక‌కు సంబంధించి త‌న ఇన్‌స్టాలో టాలీవుడ్ బ్యూటీ కొత్త ఫోటోను అప్‌డేట్ చేసింది.  తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త అన్న కామెంట్‌తో ఆ ఫోటోకు ఇచ్చింది. ఇప్ప‌టికే మెహిందీ సెర్మ‌నీ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌బోయే వెడ్డింగ్ కు ముందు పెళ్లి కూతురు ఎలా ఉత్కంటంగా గ‌డుపుతుందో త‌న ఫోటో స్టిల్‌లో చూపించిందా క్యూటీ.  ఇక త‌న వెడ్డింగ్ డ్రెస్ ఎలా ఉంటుందో కూడా ఆ ఫోటోలోనే చెప్ప‌క‌నే చెప్పేసింది. అత్యంత ఆనంద‌క‌ర క్ష‌ణాల‌కు సంబంధించిన మూమెంట్స్‌ను షేర్ చేస్తోంది. కాజ‌ల్ చేసిన పోస్టుపై ల‌క్ష్మీ మంచు కామెంట్ కూడా చేసింది.  అందంగా ఉన్నావంటూ వ్యాఖ్యానించింది. 

View this post on Instagram

Calm before the storm ????#kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on